కంకి వచ్చిన విత్తనం రాక. నిండా మునిగిన రైతన్న..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలో నవయుగ వారి మొక్కజొన్న పంట వేసిన రైతులు కంకి వచ్చిన విత్తనాలు రాక నిండా మునిగారు. బిలకల గూడూరు గ్రామానికి చెందిన సోఫీ సాహెబ్ గని గ్రామానికి చెందిన స్థానిక రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని దాదాపు 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసినట్టు ఏ రామచంద్రుడు అనే స్థానిక రైతు ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసినట్టు కంకి వచ్చిన విత్తనాలు వృద్ధి చెందకపోవడంతో తమకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి కి ఫిర్యాదు చేయడంతో గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి బాధిత రైతుల పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులు వేసిన పంట ఏపుగా పెరిగిన మొక్కజొన్న కంకిలో విత్తనాలు అభివృద్ధి చెందలేదని దీనిపై కంపెనీ అధికారులతో మాట్లాడమని అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలకు పరిశోధన నిమిత్తం రావలసిందిగా సమాచారం ఇచ్చినట్టు దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని. తెలిపారు దాదాపు మండలంలో మొక్కజొన్న రైతులు చాలాచోట్ల ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు త్వరలోనే క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు పర్యటించి పంట ఎందుకు రాలేదో పరిశోధిస్తారని తెలిపారు.