ఫుట్బాల్ క్రీడాకారులకు ఆత్మీయ వీడ్కోలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక రిడ్జ్ పాఠశాలలో గత నాలుగు రోజులుగా జరుపబడిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సీబీఎస్సీ క్లస్టర్ సెవెన్ ఫుట్బాల్ క్రీడలు నిన్నటితో ముగిశాయి .నేడు ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించినవారికి, జట్టు మేనేజర్లు మరియు కోచ్ లకు, విజయం సాధించిన జట్టు సభ్యులకు రిడ్జ్ పాఠశాల యాజమాన్యం హృదయపూర్వక వీడ్కోలు వీడ్కోలను ఇచ్చారు ఈ సందర్భంగా రిడ్జ్ పాఠశాల సీఈవో గోపీనాథ్ మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమానికి ఎక్కడ ఏ చిన్న అంతరాయము లేకుండా విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర న్యాయ నిర్ణీతలది మరియు వివిధ పాఠశాలల నుండి వచ్చిన కోచులు మరియు మేనేజర్లు ప్రధాన కారణమని తెలుపుతూ వారికి కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మీవంటి వారి సహకారం ఎంతైనా కావాలన్నారు. మంచి వాళ్ళ తోడ్పాటు ఉంటే ఎంత గొప్ప కార్యక్రమమైనా సునాయసంగా చేయగలమనే నమ్మకం మీ ద్వారా మాకు కలిగిందని గోపీనాథ్ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోటీలలో పాల్గొన్న 90 పాఠశాలల 175 జట్లు మొత్తం మూడు వేల మంది విద్యార్థులకు పేరుపేరునా గోపీనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త శ్రీమతి సౌమ్య గోపీనాథ్, డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపల్ రాజ్ కమల్ మరియు ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు.