ప్రజల ప్రభుత్వం..మంచి చేసే ప్రభుత్వం
1 min readకార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
విద్యార్థులతో పాటు కూర్చుని భోజనం చేసిన ఎమ్మెల్యే జయసూర్య
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం మధ్యాహ్నం మిడుతూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని’ఎమ్మెల్యే ప్రారంభించారు.ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు కళాశాల విద్యార్థులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకే ఈ భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అంతే కాకుండా కార్పొరేట్ లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉందని ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులను కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు దీటుగా ముందుకు తీసుకు రావాలన్నదే మంత్రి నారా లోకేష్ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు.మంచిగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలల్లో చదివే విద్యార్థులకు మంచి భోజనం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.విద్యా వికాసం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విలువైనవి రాష్ట్ర వ్యాప్తంగా 44,119 పాఠశాలలకు గాను 33,21,049 మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు యూనిఫాం అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు నాలుగు గదుల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.తర్వాత విద్యార్థులతో పాటుగా నేలపైనే కూర్చుని భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, వంగాల శివరామిరెడ్డి,మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,యాదవ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, పలుచాని మహేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో పి దశరథ రామయ్య,ఎంఈఓ ఫైజున్నిసా బేగం,వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్,గ్రామ సర్పంచ్ జయలక్ష్మమ్మ,నాగ స్వామి రెడ్డి,భూపాల్ రెడ్డి, రామేశ్వర రెడ్డి,చాకర్ వలి,గోకారి,నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.