PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిపౌల్ స్కూల్లో ఘ‌నంగా ఫెష‌ర్స్ డే వేడుక‌

1 min read

ఆక‌ట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రద‌ర్శన‌లు

ముఖ్యఅతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎన్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్  ఆత్మకూరు: నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ  కరివేన డిపౌల్ స్కూల్ లో ఫ్రెష‌ర్స్ డే వేడుక శనివారం  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పాఠశాలలో నిర్వహించిన  పోటీల్లో గెలుపొందిన‌ వారికీ ఎస్ ఎన్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి ద‌శ నుంచే   మారుతున్న విద్యాప్రమాణాలకు అనుగుణంగా విద్య‌నందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.  అలాగే పాఠ‌శాల  ప్రిన్సిపాల్ ఫాదర్ షిన్స్ మాట్లాడుతూ విద్యార్థులు చ‌దువుతో పాటు..సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చాటాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫాదర్  వినీత్ తో పాటు స్కూల్స్ సిబ్బంది తోపాటు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు .

About Author