ఘనంగా శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి అమ్మవారు జయంతి మహోత్సవం
1 min readఆషాడ అమావాస్య రోజు చౌడేశ్వరిదేవి జయంతి జరపడం దేవాంగ కులస్థుల ఆచారం
వస్త్ర నిర్మాత దేవాలమహర్షిని కాపాడడానికి చౌడేశ్వరిదేవి ఉద్భవించ్చిందని బ్రహ్మాండపురాణం ఆధార మని పూర్వికులు చెబుతారు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో దేవాంగ కులస్థులు శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి అమ్మవారు జయంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సృష్టి ఆరంభంలో దేవతలు, మానవులు, రాక్షసులు తమ మానములు కాపాడుకొనుటకు వస్త్రములు కావాలని పరమశివుడిని వేడుకొగా వస్త్ర నిర్మాణం చేయడానికి శ్రీ దేవల మహర్షి (దేవలుడు) శివుడు ఆజ్ఞతో జన్మించి వస్త్ర నిర్మాణ భాద్యతలు తీసుకున్నారని బ్రహ్మాండపురాణం చెప్తుందని దేవాంగుల విశ్వాసం. లోక కల్యాణర్ధం తలపెట్టిన వస్త్ర నిర్మాణంలో మహర్షి దేవలుడు వస్త్రాలు నేయకుండా పంచరాక్షసులు అడ్డుతగులుతు చంపడానికి ప్రయత్నించగా జగజ్జనని శ్రీశ్రీశ్రీ చోడేశ్వరి అమ్మవారు రాక్షసులను సంహరించి దేవల మహర్షిని కాపాడుటకు జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ప్రతి కులానికి ఇతిహాసములో స్థానం ఉన్నట్టు మనుబ్రహ్మ చరిత్ర ప్రకారం దేవాంగ (దేవతలకు అంగవస్త్రం నేసేవాడు) కులానికి మూలపురుషులు దేవాలమహర్షిని, దేవాంగ ఆదిపురుషుడు శ్రీ దేవాలమహర్షిని పంచరాక్షసుల నుంచి రక్షించడానికి ఆషాడ అమావాస్య రోజున శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి మాత జన్మించినది కనుక ఆషాడ అమావాస్య రోజును దేవాంగ కులస్థులు పవిత్రదినంగా భావించి అమ్మవారి జయంతి ఉత్సవాలు, పూజ క్రతువులు నిర్వహిస్తారని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. చేనేత వర్గానికి చెందిన దేవంగులు సమాజహిత కార్యక్రమాలలో ముందుంటారని పూర్వీకులు చెబుతారు అదే మన ఆచార నమ్మకం అన్నారు.