ఘనంగా బక్రీద్ పండుగ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుందలో సోమవారం ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు స్థానిక అలే హదీస్ పెద్ద మసీదు నుండి ముస్లిం సోదరులు ఉదయం ఏడు గంటలకు పెద్ద ఎత్తున పురవీధుల గుండా అల్లాహు అక్బర్ అంటూ అల్లాను ప్రార్థిస్తూ కొండపై ఉన్న ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు జరిపారు అలాగే ఆహ్లేసున్నత్ జమాత్ మరియు తబ్లీ క్ జమాత్, రాజా నగర్ కాలనీ సున్ని మసీదు వారు బక్రీద్ పండుగను ఘనంగా ఆచరించారు పెద్ద కొండపై ఉన్న ఆలే హదీస్ ఈద్గాలో ముస్లిం సోదరులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని నమాజు చేశారు ఈ సందర్భంగా ముస్లింలనుదేశించి సమియుల జామ యి మాట్లాడుతూ ఇబ్రహీం ప్రవక్త అడుగుజాడల్లో అందరూ నడవాలని ఇబ్రహీం ప్రవక్త చేసిన త్యాగబలిదాలను అందరూ పాటించాలని కోరారు దేశ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి ముస్లిం సోదరులు నడుం బిగించాలని అందరూ దేశ శాంతి సామరస్యం కోసం అన్నదమ్ముల వలె సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ద్వేష, అసూయాలను, అహంకార మనోభావాలను ప్రతి ఒక్కరు తెచ్చి వినయతో వినమ్రతతో కలిసి జీవించాలని విజ్ఞప్తి చేశారు హొ లగుండా నుండి తొమ్మిది మంది పాదయాత్రకు వెళ్లారని వారి హజ్ యాత్ర విజయవంతం కావాలని ప్రార్థించారు అలాగే ప్రపంచ మానవళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో సంపత్ భరితంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు కలకలలాడాలని కోరారు ఈద్గా ప్రార్ధనలో ఆయా మసీదుల పేష్మాములు, మౌల్ వీలు హబీబుల్లా, సమీయుల్లా, అబ్దుల్ షాకీర్, కఫీల్ ముస్లిం మత పెద్దలు, డాక్టర్ కాసిం, ముల్లావలి, అల్లా బక్షి, ముల్లా షబ్బీర్, కొలిమివాహిద్, శాలి పురకృద్దీన్ సాబ్, కరూర్ పీరన్న, సౌదీ భాష, ముస్లిం సోదరులు మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై ఈద్ ముబారక్ తెలిపారు కొత్త దుస్తులు ధరించి ముస్లిం సోదరులు మహిళలు పిల్లలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు పండుగలు ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా పతికొండ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, హనుమంతప్ప, ఎస్సై పెద్దయ్య నాయుడు, ఏఎస్ఐ శ్రీనివాసులు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.