ఘనంగా గుడి పండుగ వార్షికోత్సవం
1 min read-మనలో ఉన్న చెడు గుణాలను తొలగించాలి
-మానవునికి ప్రార్ధన ఎంతో అవసరం
-కర్నూలు బిషప్ గోరంట్ల జ్వాన్నేసు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని కడుమూరు గ్రామంలో ఉన్న ఆర్సీఎం చర్చి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్సి చాపెల్ చర్చి 30 సంవత్సరాల వార్షికోత్సవం విచారణ గురువులు మధుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు మేత్రాసన కాపరి శ్రీశ్రీశ్రీ గోరంట్ల జ్వాన్నేసు హాజరయ్యారు. బిషప్ కి మరియు ఇదే గ్రామంలో నుండి సిస్టర్ గా ఎన్నిక అయిన సిస్టర్ స్వప్న వీరిద్దరినీ గ్రామంలో భారీ ఊరేగింపు చేపట్టారు. అనంతరం బిషప్ చర్చిలో దివ్య బలి పూజను సమర్పిస్తూ మన జీవితంలో కూడా దేవుని అనుసరించాలి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టే మనం ఈ విధంగా ఉన్నామని ఎంతోమంది అనారోగ్య సమస్య వివిధ కారణాల సమస్యలతో అల్లాడిపోతున్నారని మన కుటుంబాల్లో మనకు తెలియకుండానే ఎన్నో అద్భుతాలను దేవుడు చేస్తున్నాడని అందుకే మనం దేవుడిని ప్రతిరోజూ గుర్తుకు తెచ్చుకోవాలని దేవుడు ఉన్నాడనే విశ్వాసం మనలో కలగాలని మనలో తప్పనిసరిగా మార్పు అనేది ఉండాలి దేవుని అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలని మనం ఇతరులను ప్రేమించడం కోసం దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని ఇతరుల గురించి మనం ఈర్ష, ఎవరిని వినాశనం చేద్దామా, కోపం ఇలాంటి చెడు గుణాలు మనలో ఉంటే మన కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఉండవని.. ఏసుప్రభు ఎవరి కుటుంబాల్లో ఉంటారో ఆ కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఐక్యత వెలుగు ఉంటుందని ఆయన వాక్య పరిచర్య చేశారు. అనంతరం బిషప్ గారిని భారీ శాలువాలు పూలమాలలతో విశ్వాసులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్,జీవ సుధ పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు,వివిధ విచారణల గురువులు ప్రేమగిరి రాజశేఖర్,రాజేంద్ర తదితర గురువులు మరియు కడుమూరు సంఘస్తులు ఎ బాలస్వామి,స్వామిదాసు,ఎం హరిబాబు,దేవదాస్,హరి, సూరి,శేఖర్ వివిధ గ్రామాల విశ్వాసులు పాల్గొన్నారు.