పదవి విరమణ పొందిన జనాబ్ షేక్ గౌస్ మొహిద్దిన్ కి ఘన సత్కారం
1 min readజిల్లా ఆడిట్ కార్యాలయం లో ఆత్మీయ వీడ్కోలు
36 సంవ:ల సర్వీస్ కాలంలో ఉత్తమ ఉద్యోగిగా పలువురు అధికారుల నుండి ప్రశంసలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : బాధ్యత గల ఉద్యోగ ధర్మం కోసం అహర్నిశలు కృషి చేసి గౌరవ ప్రదంగా పదవీ విరమణ పొందడం అరుదైన అదృష్టమని జిల్లా ఆడిట్ అధికారి ఏవిఆర్ గంగాధరరావు అన్నారు. జిల్లా ఆడిట్ ఆఫీస్ లో పని చేసిన షేక్ గౌస్ మొహిద్దిన్ గత 36 సంవత్సరాలుగా ఆడిట్ కార్యాలయంలో లో ఎనలేని సేవలు చేశారన్నారు. ఉన్నతాధికారుల మన్నల్ని అందుకొని తోటి సిబ్బంది తో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి తన ఉద్యోగా ధర్మన్ని సమయస్ఫూర్తితో కొనసాగిసించడం అభినందనీయమన్నారు. బుధవారం ఆడిట్ కార్యాలయంలో సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో మొహిద్దిన్ దంపతులను ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా (రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ జోన్ 2)బి చిన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి, స్టేట్ ఆడిట్ శాఖలో ఎక్కువ కాలం పనిచేసి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా చేసే ఉద్యోగంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో సమానంగా అత్యవసర పరిస్థితులలో రాత్రి అనక. పగలనక ప్రతి ఉద్యోగి పనిచేస్తారని అన్నారు. పదవి విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన కార్యాలయ పెద్దలకు తెలియజేయాలని సూచించారు. డ్యూటీ విషయంలో మొహిద్దిన్ నిబద్ధతతో పనిచేసేవారని, కుటుంబాన్ని చిన్న ఉద్యోగంతో నడుపుకు రావటం దైవ సంకల్పం అన్నారు. ఉద్యోగ విషయంలో చాకచక్యంగా తనకు అప్పగించిన పనిని సెలవు అయినప్పటికీ నిబద్ధతతో బాధ్యతగా పని చేసే వారిని కొనియాడారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ ఎన్ జి జి ఓ’స్ అధ్యక్షులు డిఎస్ఎస్ గణేష్ , ఉపాధ్యక్షులు వై జయప్రకాష్ , కార్యదర్శి బి లక్ష్మీపతి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు మహిళా ఉద్యోగులు పాల్గొని దుశాలువా కప్పి, పుష్పగుచ్చాలు అందించి సన్మాన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.