పదవి విరమణ చేసిన హోంగార్డ్ కి ఘన సన్మానం
1 min readప్రజలకు, ప్రభుత్వానికి అహర్నిశలు కృషిచేసేది పోలీసులు
ఏఆర్ ఆర్ ఎస్ఐ పవన్ కుమార్ ప్రశంసలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గౌరవప్రదంగా అహర్నిశలు కృషి చేసి, ప్రజలకు ప్రభుత్వానికి సేవలు అందించడం అదృష్టమని ఏలూరు జిల్లా హోంగార్డ్స్ ఏ.ఆర్.ఆర్.ఐ పవన్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా హోంగార్డ్ శాఖ జంగారెడ్డిగూడెం పరిధిలో పని చేసిన యర్రా బాలస్వామి (హోంగార్డ్ 170) గత 35 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో గత 30 సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశారు. పదవీ విరమణ సందర్భంగా శనివారం ఏలూరు ఏ ఆర్ ఆఫీస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్.ఆర్.ఐ పవన్ కుమార్ వారిని ఘనంగా పూలమాలలు వేసిదుశాలువాతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఏ.ఆర్.ఆర్.ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని. ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న పోలీసు ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి, పోలీస్ శాఖలో ఎక్కువ కాలం పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు. ప్రశంసలు తన సేవల ద్వారా అందించడం అభినందనీయమని అన్నారు. పదవి విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు. ఆర్ఎస్ఐ భాస్కరరావు మాట్లాడుతూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు శాఖపరమైన బెనిఫిట్స్ వారికి, వారి కుటుంబ సభ్యులకు సకాలంలో అందించే విధంగా ఉన్నత అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామని, పెన్షన్ మరియు తదితర బెనిఫిట్స్ అంశాలను. పై అధికారుల దృష్టికి తెలియచేస్తామని తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చిన్నారావు, కార్యాలయ సిబ్బంది, తోటి హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.