ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఆత్మీయ స్వాగతం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గని గ్రీన్ కో సోలార్ పార్క్, గ్రీన్ కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పరిశీలన కోసం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు మ.12:55 గం.లకు చేరుకున్నారు.ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయ నాగేశ్వర రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, గ్రీన్ కో సిబ్బంది, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, డిఎస్పీ వెంకట రామయ్య తదితరులు స్వాగతం పలికారు.కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుండి హెలికాప్టర్ లో గ్రీన్ కో సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ ఏరియల్ వ్యూ కోసం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు.గ్రీన్ కో సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పర్యటన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని సా.5గం.లకు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఉప ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు.ఉప ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలుతిరుగు ప్రయాణంలో ఉప ముఖ్యమంత్రి గారికి జిల్లా ఎస్పీ జి.బిందు మాదవ్ ఘన వీడ్కోలు పలికారు.