PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ నాడు దుకాణాలు, సంస్థలకు సెలవు దినం

1 min read

కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలి

అర్హులైన ప్రతి వ్యక్తికి పోలింగ్ రోజున సెలవు ప్రకటించాలి

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో శిక్షార్హులు

ఏలూరు ఉప కార్మిక కమిషనర్ పి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కార్మికశాఖ ఆంధ్ర ప్రదేశ్ దుకాణముల మరియు సంస్థల చట్టం, 1988, ఆంధ్రప్రదేశ్ శాసన సభ మరియు లోక్ సభ ఎన్నికలు  ది. 13-05-2024 (సోమవారం)న పోలింగ్ జరుగును కావున  ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B (1) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ దుకాణములు మరియు సంస్థల చట్టం, 1988 లోని సెక్షన్ 31 (2) లోని అధికారాలను వినియోగించుకొంటు మరియు G.O. లో ఉదహరించిన ఉత్తర్వులను అనుసరించి, చీఫ్ ఇన్స్పెక్టర్ మరియు లేబర్ కమీషనర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారు మరియు ఆంధ్రప్రదేశ్  దుకాణములు మరియు సంస్థల చట్టం, 1988 క్రింద పోలింగ్ రోజున అంటే ది 13.05.2024 న (సోమవారం ) దుకాణములు మరియు సంస్థలకు సెలవు ప్రకటించడమైనదని ఏలూరు ఉప కార్మిక కమీషనర్ పి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ క్రింది నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసినదిగా కోరడమైనది.  1.       ఏదైనా వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక సంస్థ లేదా ఏదైనా ఇతర సంస్థలలో ఉద్యోగం చేస్తున్న ప్రతి వ్యక్తీ, శాసనసభ మరియు లోక్ సభ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులైన ప్రతి వ్యక్తికి, పోలింగ్  రోజున, సెలవు మంజూరు చేయవలెను. 2.      ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B (1) ప్రకారం, సెలవు దినం మంజూరు చేయబడినందున  అటువంటి వ్యక్తీ యొక్క వేతనాలలో సదరు సెలవుకు ఎటువంటి తగ్గింపు చేయరాదు. 3.  ఏదైనా యజమాని సబ్ సెక్షన్ (1) లేదా సబ్ సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘిస్తే, అటువంటి యజమాని జరిమానాతో శిక్షార్హులు.4.            ది 13.05.2024 (సోమవారం) న పోలింగ్ జరిగే నియోజక వర్గం వెలుపల పనిచేసే రోజు వారీ వేతనం / సాధారణ కార్మికులు కుడా ఓటు వినియోగించు కోవడానికి అర్హులు.   ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B (1) ప్రకారం పోలింగ్ రోజున అతని / ఆమె కార్యాలయం మూసివేయబడనప్పటికి పోలింగ్ రోజున సెలవు మరియు వేతనాలకు అర్హులు.  5. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 135B (iv) లోని నిబంధనల ప్రకారం, అతను పని చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి ప్రమాదం లేదా గణనీయమైన నష్టాన్ని కలిగించే పరిస్తితులలో సదరు ఓటర్లకు ఈ సెక్షన్ వర్తించదు.  ఏలూరు జిల్లాలోని దుకాణాలు, సంస్థలు యజమానులకు తెలియజేయునది ఏమనగా ది. 13.05.2024 న ఆంధ్రప్రదేశ్ నందు లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున దుకాణాల మరియు సంస్థల యజమానులు ది. 13.05.2024 న మీ వద్ద పని చేస్తున్న కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకోనుటకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు.

About Author