బాలన్న నామినేషన్ కు భారీ గా తరలివచ్చిన జనం
1 min readజన సంద్రంగా మారిన మంత్రాలయం
శ్రీ మఠం లో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పూజలు
వైకాపా అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
మరో నామినేషన్ దాఖలు చేసిన టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి
రాఘవేంద్ర రెడ్డి వైకాపా కి వెన్ను పోటు పోడిచి టీడీపీ లోకి చేరారు
ప్రజా ఆశీస్సులతో నాల్గవ సారీ కూడా అసెంబ్లీ కి వెళ్ళడం ఖాయం
గుమ్మనూరు జయరాం కు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆలూరు లో పోటీ చేయాల్సింది
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లు ఉన్నంత వరకు నాదే గెలుపు
పెద్ద ఎత్తున కదిలి వచ్చిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు.
కౌతాళం/ మంత్రాలయం, పల్లెవెలుగు: మంత్రాలయం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గా వై. బాలనాగిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేసి పత్రాలను ఆర్వో మురళీ కి అందజేశారు. అదే విధంగా టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి నియోజకవర్గంలోని మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం మండలాల్లోని వైకాపా శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జన ప్రవాహం లా తరలిరావడంతో మంత్రాలయం జన సంద్రంగా మారింది. బాలనాగిరెడ్డి నినాదంతో ప్రభం’జనం’ గళమెత్తారు. ముందుగా మండల పరిధిలోని రాంపురం గ్రామం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి నేరుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్దకు చేరుకుని గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుంచి అబౌడీ హోటల్ చేరుకుని వై. సీతారామిరెడ్డి , నాయకులు, కార్యకర్తలతో కలిసి రాఘవేంద్ర సర్కిల్ వరకు ఉరేగింపు నిర్వహించారు. వై. సీతారామిరెడ్డి , వై. బాలనాగిరెడ్డి వేర్వేరుగా నామినేషన్ పత్రాలను ఆర్వో మురళీ వద్ద దాఖలు చేశారు. వైకాపా నేత లు వై. ప్రదీప్ రెడ్డి , వై. ధరణీ రెడ్డి ఆధ్వర్యంలో రాఘవేంద్ర సర్కిల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు వై. సీతారామిరెడ్డి , వై. బాలనాగిరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తు తహసీల్దార్ కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్ చేరుకున్నారు. అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో రాంపురం రెడ్డి సోదరులకు సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య గజమాల తో సన్మానం నిర్వహించారు. అనంతరం వై. బాలనాగిరెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గంలోని దేవుళ్ళు, ప్రజలు, నాయకులు, కార్యకర్తల ఆశీస్సులతో మూడు సార్లు అసెంబ్లీ కి వెళ్ళడం జరిగిందని అదే తరహాలోనే నాల్గవ సారీ కూడా అసెంబ్లీ కి వెళ్ళడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాకు తోడుగా నా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఓసీ నాయకులు ఉన్నంత సేపు భయపడే ప్రసక్తే లేదన్నారు. 2019లో మాధవరం రామిరెడ్డి కి నమ్మి జగన్ మోహన్ రెడ్డి కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ఇస్తే రాఘవేంద్ర రెడ్డి ఈ రోజు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీ లోకి వెళ్లారని వారి స్వలాభం కోసమే బీసీ అంటున్నారు తప్పా బీసీలకు వారు చేసింది ఏమి లేదని మండిపడ్డారు. మీకు మంచి జరిగితేనే ఫ్యాన్ గుర్తు కు ఓటు వేయండి అని ధైర్యంగా ప్రజలను కోరారు. పార్టీలన్ని కూటమి పేరుతో వస్తున్నాయని ఎన్ని పార్టీలు ఒక్కటైనా నాకు మీరంతా ఉన్నంత సేపు సింహంలా సింగిల్ గానే వస్తానని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు లో మా సోదరుడు వై. వెంకట్రామి రెడ్డి మీద మీసాలు తిప్పుతున్నాడు కదా నిజంగా గుమ్మనూరు జయరాం కు దమ్ము, ధైర్యం ఉంటే ఆలూరు లో పోటీ చేయాల్సి ఉండేదని సవాల్ విసిరారు. నీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడ్డరని హెచ్చరించారు. మన నియోజకవర్గం లో కూడా 15 సంవత్సరాలు ప్రజలు ప్రశాంతంగా జీవించారని అలాంటి పాలనే మళ్లీ కోరాలని అలా కాకుండా రాఘవేంద్ర రెడ్డి కి ఓటు వేస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఈ ఐదేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశానని వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఎలాంటి విమర్శలు చేస్తున్నాడో ఆయన కే అర్థం కావడం లేదన్నారు. మన ఎంపీ బీసీ సోదరుడైన బీవై, రామయ్య ఎమ్మెల్యే గా వై. బాలనాగిరెడ్డి అయిన నాకు రెండు గుర్తు లు ఫ్యాన్ గుర్తు లే అని తప్పకుండా మే 13వ తేదిన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమరానికి మీరంతా సిద్ధమా అంటు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కోరగా సిద్ధం సిద్ధం సిద్ధం అంటు నినాదాలు చేశారు. మా కుటుంబం పై ఇంత ప్రేమ, అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికి రుణ పడి ఉంటానని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి చేతులు జోడించి నమస్కరించారు. రాఘవేంద్ర సర్కిల్ నుంచి గోశాల వద్ద ఏర్పాటు చేసిన భోజన వసతి కేంద్రం వరకు నాయకులు, కార్యకర్తల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, ఇన్చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, స్థానిక నాయకులు, నాలుగు మండలాలు నాయకులు పాల్గొన్నారు.