ఆర్టిసి డిపో పరిధిలో అధిక సంఖ్యలో బస్సులు నడపాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ ఆర్టిసి డిపో పరిధిలో అధిక సంఖ్యలో బస్సులను నడపాలని భారతీయ జనతా పార్టీ పత్తికొండ తాలూకా శాఖ ఆధ్వర్యంలో పత్తికొండ RTC డిపో ఇన్చార్జి మేనేజర్ బిజెపి నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. కర్నూలు నుండి సాయంత్రం 7 గంటలకు పత్తికొండకు బయలుదేరే బస్సు గత నెల రోజుల నుండి తిరగడం లేదని, ప్రయాణికులు కర్నూలు బస్టాండ్ లో అక్కడ ఉన్న కంట్రోలర్తో వాదోపవాదనలకు దిగుతున్నారన్నారు.దీన్ని గమనించిన బిజెపి నాయకులు అక్కడ ఉన్న కంట్రోలర్ ని వివరణ కోరగా మీ పత్తికొండ డిపో వారే ఆ బస్సును రద్దు చేసినట్లు తెలిపారని చెప్పారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ 7 గంటలకు కర్నూలు నుండి బయలుదేరే బస్సును పునరుద్దించాలని, అలాగే పత్తికొండ నుండి గుత్తికి ఏ ఒక్క ఆర్డినరీ బస్సు కూడా నడపడం లేదని కాలo చెల్లిన బస్సులు తొలగించి కొత్త బస్సులు నడపడాలని బిజెపి నాయకులు కోరారు. అలాగే పత్తికొండ డిపో నుండి సుదూర ప్రాంతాలు విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాలకు కొత్తగా బస్సులను నడపాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయిడు, పూన మల్లికార్జున, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, లీగల్ సెల్ నగేష్ , ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం నరేష్, తుగ్గలి మండల అధ్యక్షులు లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు.