ధ్యానం చేసుకుని మనిషి ప్రశాంతతను పొందాలి..ఆలూరు ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతుప్రజలు నిత్యం ఏదో ఒక పని మీద రోజంతా టెన్షన్ గాను మరియు చిరాకు గాను వివిధ రకాలైన ఒత్తిడికి గురవుతుంటారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సమస్య కావున ప్రతి ఒక్కరు తమ జీవితంలో రోజు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తూ ప్రశాంతతను పొందాలని ఒత్తడిని తగ్గించుకొని ఆయురారోగ్యాలను కాపాడుకోవాలని అది ఇంటిలో అయినా కానీ ఇలా ఓంశాంతి ఆశ్రమాలలో కానీ ధ్యానం చేసుకుని మనిషి ప్రశాంతతను పొందాలని ఈరోజు ఆలూరు నందు ఓం శాంతి ఆశ్రమాన్ని దర్శించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓం శాంతి నిర్వాహకులు మరియు ఆలూరు మండల కన్వీనర్ కురువ మల్లికార్జున కో కన్వీనర్ అరికేర వీరేష్ ఎంపిటిసి జీర గౌడప్ప తుమ్మలబీడు సర్పంచ్ మల్లికార్జున మాజీ ఎంపిటిసి హత్తిబెళగల్ నాగేంద్ర భాస్కర్ మాజీ సర్పంచ్ మరకట్టు యల్లప్ప నాయకులు రాముడు మల్లప్ప హనుమంతు వెంకటేశ్వర్లు శివ వరుణ్ బాబు శేఖర్ కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.