ఇంటి స్థలం మంజూరు చేయాలనీ కోరుతు వికలాంగుల సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS ఆద్వర్యంలో వెలుగోడు మండలవికలాంగుల సర్వ సబ్య సమావేశము వెలుగోడు మండలకమిటీ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్ జె ఇన్తియజ్ టి రహంతుల్ల ద్వార వెలుగోడు లో బృందావనం స్కూల్ నందు జరిగినది . మండలo లొని వికలాంగుల అందరూ ఈ కార్యక్రమానికి హజరై తమ తమ సమస్యలు ప్రజా ప్రతినిధులు మరియు సంస్తసబ్యులకు తెలియచేసారు.ముక్యముగా ప్రతి వికలంగునికి ఇంటి స్తలాలు మంజూరు చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమానికి హజరైన TDP పార్టీ నాయకులు DR.జాకీర్ హుస్సేన్ SYED అమీర్ హంజా వికలాంగుల సమస్యల పై సానుకూలంగా స్పందించారు.
మా ప్రధాన డిమాండ్లు1 . జగనన్న గృహాలలో అర్హులైన వికలాంగులందరికి ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ద్వార స్తలం కేటాయించి.ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.2 . వికలంగులందరికి అన్తోదయ కార్డులు మంజూరు చేయాలి.3 . .వికలాంగునికి వికలాంగురాలికి వివాహంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న కుటుంబంగా పరిగణించి ……రేషన్ కార్డులు ఇవ్వాలి4.. అర్హులైన ప్రతి వికలాంగులకు స్కూటర్లు పంపిణీ చేయాలి.ఈ కార్యక్రమములో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కె గంగాధర్ శెట్టి వెలుగోడు మండల అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సెక్రటరీ జె ఇంతియాజ్, టి రహంతుల్ల, ,నురుల్లమీన్ రవిగౌడ్ మాలి సుంకమ్మ ఎల్లమ్మ ముక్తరున్ సుమతి జకాత్, ఆటో రహం, mrps నాయకులూ నగశేసులు, పాల్గొనడం జరిగింది.