ప్రజా పరిపాలనకు దర్పణం.. క్యాబినెట్ నిర్ణయాలకు ప్రజల నీరాజనం..
1 min readరాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు..
పల్లెవెలుగు వెబ్ పాణ్యం : ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజా పరిపాలనకు దర్పం పడుతుందని బుధవారం నాడు రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి, లాయర్ బాబు మాట్లాడుతూ భూముల రీసెర్వే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం భూమి సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించాలని క్యాబినెట్ ఆమోదించడం జగన్ బొమ్మ ఉన్న పాస్ బుక్ లను తొలగించి రాజముద్ర గల పాసుబుక్కులను పంపిణీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం ప్రజా పరిపాలనకు నిదర్శనం అన్నారు స్థానిక సంస్థల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నవారికి పోటీ చేసే అవకాశం కల్పించే బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయడం అక్టోబర్ నుండి కొత్త మద్యం పాలసీని తీసుకోరావడం రాష్ట్రంలోఎన్ డి ఏ క్యాబినెట్ నిర్ణయాల వలన ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని నిలబెట్టుకుందన్నారు ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్డీఏ కూటమి ప్రజా పరిపాలన అందిస్తుందన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటి పథకాలను అమలు చేస్తుందన్నారు.