పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం ఒక నామినేషన్ దాఖలు
1 min readపట్టబద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రీటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి కి పేపకాయల రాజేంద్ర నామినేషన్ సెట్ అందజేత
ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారికి కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అభ్యర్ధి పేపకాయల రాజేంధ్రతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఈనెల 10వరకు కలెక్టరేట్ లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 8,9వ తేదీలు సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 3 గం. వరకు ఏలూరు కలెక్టరేట్ లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 11న పరిశీలన, 13వ తేదీ మధ్యాహ్నం 3. గం. వరకు ఉప సంవహరణకు గడువువుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్, మార్చి 3న ఏలూరులో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికలకు సంబంధించి 440 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3,15,261 మంది ఓటర్లు ఉన్నారు.