ఏ.పీ.ఆర్.ఎస్.ఏ. రెవెన్యూ డైరీ ని ప్రారంభించిన కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 2025 వ నూతన సంవత్సరం పురస్కరించుకొని ఏ.పీ.ఆర్.ఎస్.ఏ., రెవెన్యూ డైరీ 2025 ని శ్రీయుత కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, ఐ.ఏ.ఎస్., వారిచే ప్రారంభించడం జరిగింది. అలాగే రెవెన్యూ క్యాలెండర్ 2025 ను మన ప్రియతమ జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన శ్రీమతి బి .నవ్య, ఐ.ఏ.ఎస్., వారిచే ప్రారంభించడం జరిగింది. అలాగే వీరితోపాటు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి సి. వెంకటనారాయణమ్మని అలాగే పరిపాలన అధికారి శ్రీమతి పి.విజయశ్రీ ని, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు శ్రీ రజినీకాంత్ రెడ్డి , జిల్లా కార్యవర్గం నుండి అధ్యక్షుడు సి.నాగరాజు, సెక్రెటరీ ఎం.లక్ష్మీరాజు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనేయ రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లోకేశ్వరి, బి. ఎల్. కృష్ణవేణి , కె. రఘుస్వామి , కలెక్టరేట్ నుండి శివపార్వతి మరియు కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ రామాంజనేయులు , వైస్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణమూర్తి ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్లు అధ్యక్షుడు సి. నాగరాజు, కార్యదర్శి ఎం. లక్ష్మిరాజు, ఏ.పీ.ఆర్.ఎస్.ఏ., కర్నూలు జిల్లా.