ఏలూరు నగరం సుందరీకరణలో భాగంగా రంగవల్లులతో అలంకరణ
1 min readసంక్రాంతి అతిధులకు ఆహ్వానం
సుందరీ కరణ పాడు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు
కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: సుందరీకరణ చర్యల్లో భాగంగా ఏలూరు నగరాన్ని రంగులతో అలంకరిస్తున్నామని అయితే వివిధ సంఘాలవారు,ఇతరులు మున్సిపల్ గోడలపై వాల్ పోస్టర్లు అతికించి సుందరీకరణను పాడు చేస్తున్నారని అటువంటి వారిపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్లలో కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి,ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా నగరానికి విచ్చేస్తున్న అతిధులను ఆహ్వానిస్తూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరం అంతా పరిశుభ్రత-సుందరికరణ చర్యలు చేపట్టామన్నారు.అందులో భాగంగా సుందరీకరణ పనులలో మేము సైతం అంటూ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్,పలువురు కార్పొరేటర్లో మున్సిపల్ అధికారులు స్వయంగా డివైడర్లకు రంగులు వేశారు.ఈ సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ మాట్లాడుతూ ప్రజాధనం లక్షలాది రూపాయలు హెచ్చించి నగరంలో డివైడర్లు,గోడలు రంగులు వేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల చిత్రాలను వేసి సుందరికరణ చేస్తుంటే వివిధ సంఘాల వారు,విద్యాసంస్థలవారు,వివిధ పార్టీలకు సంబంధించిన వారు అర్ధరాత్రి సమయాల్లో రంగులు వేసిన గోడలపై వ్యాపార ప్రకటనలు రాసిన, పోస్టర్స్ అతికించిన సుందరీకరించిన నగరాన్ని అసహ్యంగా తయారు చేస్తున్నారని అట్టివారిపై కార్పొరేషన్ తరపున రాత్రిపూటలు నిఘ ఏర్పాటు చేసి పోస్టర్స్ అతికించిన వారిని పట్టుకుని వారిపై నాన్ బెయిల్ బుల్ సెక్షన్ కింద పోలీసు కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,కమిషనర్ ఏ.భాను ప్రతాప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్,బత్తిన విజయకుమార్, కలవకొల్లు సాంబ, సన్నీ తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు.