వర్షం కోసం కప్పల ఊరేగింపు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: వర్షాలు కురువాలని గడివేముల మండలంలోని బూజునూరు గ్రామస్తులు శుక్రవారం కప్పలతో ఊరేగింపు నిర్వహించారు. ఒక కర్రకు మధ్యలో కప్పలను వేలాడదీసి డప్పు వాయిద్యాలతో ఇంటింటికి తీరుగుతూ వర్షాలు కురువాలని వానదేవుడిని వేడుకున్నారు. ఊర్లో ఉన్న గ్రామదేవతలకు పూజలను నిర్వహించి, సాయంత్రం సమీపంలో ఉన్న వాగులోనికి వెళ్లి గంగ పూజలు చేశారు.