బంగారు కమ్మలు అప్పగించిన ఏ పి ఎస్ ఆర్ టి సి ఉద్యోగి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు డిపో కు చెందిన ఏపీ 21 Z 1604 పల్లె వెలుగు బస్సులో కోడుమూరు నుండి ఎమ్మిగనూరు ప్రయాణించిన డోన్ వాస్తవ్యులు సువర్ణమ్మ టికెట్ తీసుకుని ఎమ్మిగనూరు బస్టాండు రాగానే దిగి వెళ్ళిపోయారు . తరువాత వారి దగ్గర ఉన్న రెండు జతల కమ్మలు( విలువ 32000 ) బస్సులో పడిపోయినట్టు గమనించి వారు డిపో దగ్గరకు వచ్చి ఎంక్యూరి కంట్రోలర్ ని అడిగి ఆయన సలహా మేరకు ఆర్టీసీ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ను వెంటనే కలిశారు.ఆయన వెంటనే స్పందించి డిపో లో వచ్చి నిలబడిన బస్ దగ్గరికెళ్ళి వెతకగా బంగారు ఆభరణాల బాక్స్ దొరికింది వారి దగ్గరున్న టికెట్ను చూపించడం జరిగినది. వారు ప్యాసింజర్ తో పాటు బస్సు దగ్గరికి వెళ్లి చెక్ చేయగా బస్సు సీటు కింద పడినట్లు గమనించి ఆర్టీసీ కానిస్టేబుల్ డీఎం బి అమర్నాథ్ కి విషయం తెలిపి, ఏడీసీ గడ్డం రాజు సమక్షంలో వారికి అప్పగించడం జరిగినది. ప్రయాణికులు తమ వస్తువు తమకు అందజేసినందుకు ఏ పీ ఎస్ ఆర్ టి సి ఉద్యోగినీ మెచ్చుకొని హర్షం వ్యక్తం చేశారు.