కర్నూలు జీజీహెచ్ లో పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స
1 min readఅడిషనల్ DME & సూపరింటెండెంట్, డావి.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామ శివారులో 2-5-2024 గురువారం ఉదయం మాలిక్ భాషా అనే 19 ఏళ్ల యువకుడు ఇసుకతో కూడిన ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. లోడుతో ఉన్న ట్రాక్టర్ వేగంగా వెళ్తుండడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకొమ్మ కు యువకుడి కుడి తొడపైకి ఒకవైపు నుంచి మరో వైపుకు చొచ్చుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే, స్థానికుల సహాయంతో, బాధితుడిని సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. స్థానిక వైద్య సిబ్బంది ఆదేశాల మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు.ఆసుపత్రి క్యాజువాలిటీలో విభాగం లోని ప్రాథమిక చికిత్స అనంతరం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌లో డా.చక్రవర్తి నేతృత్వంలోని వైద్య బృందం డా.విజయశంకర్, డా.భాస్కర్ రెడ్డి, డా.అనూష, డా.జగన్మోహన్ రెడ్డిల శస్త్రచికిత్స డా.సంధ్యా రాణి అనస్థీషియా ఇచ్చి చుట్టుపక్కల ఉన్న సిరలు, ధమనులు, నరాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వైద్య బృందం మూడున్నర గంటల పాటు శ్రమించి చొచ్చుకొని పోయిన చెట్టు కొమ్మను విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. తెలంగాణ రోగులకు ఆరోగ్యశ్రీ లేకపోయినా వారికి కాలు తీసేయకుండా రోగిని, యువకుడి ప్రాణాలను కాపాడిన వైద్య బృందాన్ని అభినందించినట్లు తెలిపారు.ఆసుపత్రి లోని వైద్యసిబ్బంది అంతా ఎంతో అంకితభావంతో పనిచేసి ఆసుపత్రికి పేరుప్రఖ్యాతులు తెస్తున్నారని అన్నారు. ఆసుపత్రికి ఎవరు వచ్చినా అందరికీ మెరుగైన వైద్యం అందించాలని సంబంధించిన హెచ్చోడిలను ఆదేశించారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్, డా.చిట్టి నరసమ్మ, వైస్ ప్రిన్సిపాల్ అండ్ సర్జరీ విభాగాధిపతి, డా.హరిచరణ్, సర్జరీ విభాగపు వైద్యులు డా.చక్రవర్తి, డా.రామకృష్ణ నాయక్, డా.విజయ శంకర్, డా.భాస్కర్ రెడ్డి, అనస్థీషియా హెచ్ఓడి, డా.విశాల, మరియు వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి తెలిపారు.