ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి కి వినతి.. ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : సీఎం నివాసంలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో పలు విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలను చర్చించడం జరిగిందని, విద్యా రంగ మరియు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని నారా లోకేష్ గారు తెలియజేశారని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యంగా జీవో 117 రద్దు, పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూలు ను ఏర్పాటు చేసి తరగతికి ఒక ఉపాధ్యాయున్ని ఇవ్వాలని, 80 రోలు దాటిన పాఠశాలకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టు ఇవ్వాలని కోరారు. తెలుగు మీడియం కొనసాగించాలని, హై స్కూల్ ప్లస్ లను కొనసాగించాలని, వీలైతే అన్ని మండలాల్లో పంచాయతీ రాజ్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరామన్నారు. జూనియర్ కళాశాలలో 40 శాతం కోటా ప్రమోషన్లు పునరుద్ధరించాలని ఆపస్ పక్షాన కోరామన్నారు. సిపిఎస్ ఉద్యమ కేసులను ఎత్తివేయుటకు ఉత్తర్వులను ఇవ్వాలని,ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని, బదిలీలకు అకాడమిక్ ఇయర్స్ ప్రాతిపదికగా తీసుకోవాలని, మెమో నంబర్ 57 అమలు చేసి 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయాలని, యాప్లు అన్ని తీసివేయాలి అని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలకు ఒక ప్రత్యేక కమిటి,డిఈఓ పూల్ పండిట్ల సమస్య, అంతర్ జిల్లా బదిలీలు, డీఎస్సీలో సంస్కృతం మరియు స్పెషల్ పోస్టుల భర్తీ విషయమై డిమాండ్ చేయడం జరిగింది.ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో వందరోజుల యాక్షన్ ప్లాన్ ను మార్పు చేయాలని, హిందీ సోషల్ సబ్జెక్టుల సిలబస్ తొలగించాలని, ఇంకా అన్ని పాఠ్య పుస్తకాలను సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలని కోరడం జరిగిందిచాగంటి తో నైతిక విలువలు పై ప్రతివారం ఒక గంట కార్యక్రమం నిర్వహించాలని, ఏడూ వారికి 50 శాతం సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఎంటిఎస్ 98 మరియు 2008 వారికి పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలని కోరడం జరిగింది. ఇంకా అనేక సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, విద్యా శాఖ ఉన్నతాధికారులు నిరంతరం అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు .ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు తో పాటు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, చిరంజీవి, అశోక్ బాబు, రాంభూపాల్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు, తదితర విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.