నాడు నేడు పనులపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ కి వినతి
1 min readఆర్ యు ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు చిలకలడోనా గ్రామం ఎంపీపీ పాఠశాల నాడు నేడు పనుల పైన హెచ్ఎం సరళ దేవి ని విచారణ జరపాలని ఈరోజు ఆర్ యు ఎస్ ఎఫ్ ఆర్ పి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్రిది మాట్లాడుతూ మంత్రాలయం మండలం చిలకలడోన ఎంపీపీ పాఠశాలలో హెచ్ఎం సరళ దేవి అవినీతికి పాల్పడడం జరిగిందని గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాడు నేడు పనుల్లో డబ్బులు ఉన్నా కూడా పనులు జరగకపోవడం ఏంటి అదేవిధంగా జరిగినటువంటి పనుల్లో ఎటువంటి నాణ్యత లేకపోవడం కనిపిస్తుంది 32 లక్షల రూపాయలు పాఠశాల అకౌంట్ కి పడగా తక్కువ వస్తాయేమో అని నాలుగు లక్ష రూపాయలు అదనంగా తీసుకొని నాసిరకపు పనులు చేయించడం అంటే సిగ్గుచేటు అనిఅదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ సంతకాలు లేకుండా డబ్బులను విధంగా డ్రా చేస్తారని అక్కడ కట్టించినటువంటి మరుగుదొడ్లు గవర్నమెంట్ మెజర్మెంట్ ప్రకారం 98,000 ఖర్చు చేయాల్సినటువంటి ఈమె తన సొంత డబ్బు అనే విధంగా అదనంగా 50 వేల రూపాయలను వాడడం అంటే ప్రభుత్వ సొమ్ము దోచేస్తుందని అర్థం అవుతుంది. జరిగినటువంటి నాసిరకపు పనుల్లో కొన్ని కొన్ని గదులు అయితే వర్షం వచ్చిందంటే విద్యార్థులు కూర్చోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి వస్తుందని అదేవిధంగా డబ్బులు ఉన్నా కూడా పాఠశాల పరిసర ప్రాంతాల్లో ముళ్ళకంపలతో కూడినటువంటి చెట్లు ఉండడం జరుగుతుంది వాటి నుండి విషపురుగులు రావడం జరుగుతున్న కూడా తనకు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ధనాధ్యమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నటువంటి హెచ్ఎం సరళ దేవి పై విచారణ జరిపి ఆమెను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారి తీస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నవీన్ సతీష్ ప్రకాష్ అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.