ఘనంగా కాలేజ్ బీసీ వసతి గృహంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
1 min readపాల్గొన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్జీవో అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
క్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: స్థానిక కాలేజ్ బిసి బాలికల వసతి గృహంలో హెచ్ డబ్ల్యు ఓ మరియు ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ ఏలూరు తాలుకా సంయుక్త కార్యదర్శి ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమి క్రిస్టమస్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీస్తు పుట్టుకను ప్రేమ,కరుణ,సహాయతను వివరిస్తూ క్రీస్తు ఈ లోకంలోప్రతి మనిషి సన్మార్గంలో నడిచే బోధనలు చేశారని. ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని విద్యార్థులకు వివరించారు.విద్యార్థినులు విచ్చేసిన క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికీ క్రిస్టమస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.