పత్తికొండలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలి!
1 min readఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రెవిన్యూ డివిజన్ కేంద్రంలోని పత్తికొండ పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.శ్యాంకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి కోరారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత ని ఎమ్మెల్యే కెఈ.శ్యాంకుమార్ తో పాటు పత్తికొండ న్యాయవాదులు కలసి పత్తికొండ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కు సహకరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కర్నూలు జిల్లాలో వెనుకబడిన పత్తికొండ పట్టణంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లేకపోవడంతో న్యాయవాదులు మరియు కక్షిదారులు, ప్రజలు దాదాపు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆదోనికి వెళ్ళవలసి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం పత్తికొండ రెవెన్యూ డివిజన్ అవడంతో సీనియర్ సివిల్ జడ్జికోర్టు ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేష్, టీడీపీ రాష్ట్ర నాయకులు తుగ్గలి నాగేంద్ర, తిమ్మయ్య చౌదరి, న్యాయవాదులు బాలభాష, సుధాకృష్ణ, రాజశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.