PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు

1 min read

వైసీపీ వార్డుల్లో ఒక పైపు కూడా వెయ్యలేదు

అభివృద్ధి అజండాతో టీడీపీ చేరికలు

పార్టీలో డ్రామాల ఆర్టిస్టుల పరిస్థితి అయిపోయింది

ఎమ్మెల్యే బీవీ సమక్షంలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని దీన్ని ఆకర్షితులై ఈరోజు వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సరోజ, వహిద్, స్వాతి, వైసీపీ మరియు సోషల్ మీడియా నాయకులు మన్సుర్ బాషా, జహీర్, వినయ్ లతో మాజీ కౌన్సిలర్ వహబ్ పాటు తదితరులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కౌన్సిలర్లు  పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. గత ఐదేళ్ల నుండి టిడిపి పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఉన్నారని, వారికి పార్టీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా పార్టీలో మోసం చేయాలని మోసపూరిత డ్రామాలు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. వైసీపీలో కౌన్సిలర్లు వారి వారి వార్డులో ఒక వైపు కూడా వేసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. కనీసం ఒక వ్యక్తికి సహాయం చేసిన పాపనా పోలేదన్నారు. ఆఖరికి స్థానిక సంస్థల నిధులు కూడా మాజీ సీఎం జగన్ గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి కష్టపడిన నిజాయితీ కార్యకర్తలకు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఏరోజు మర్చిపోడని, రాజకీయాలకు అతీతంగా  అభివృద్ధి అజెండాతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వార్డుల్లో అభివృద్ధి చేసుకోలేక పోయారని, కౌన్సిలర్లు వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానని ఎమ్మెల్యే బీవీ స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారి పార్టీ అభ్యున్నతికి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విదంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వార్డులో ఎటువంటి అభివృద్ధి చేసుకోలేక పోయారన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author