ప్రధానోపాధ్యాయులకు ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం
1 min readరాఘవేంద్ర బిఈడి కళాశాల నన్నూరు టోల్ గేట్ నంద్యాల రోడ్డు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు కడప నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు , ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు ఆరు రోజుల నాయకత్వ లక్షణాలపై శిక్షణా కార్యక్రమం cycle 2 రెండవ బ్యాచ్ మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని గౌరవ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె శామ్యూల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల నుండి వచ్చిన శిక్షణార్థులకు మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో ఆర్జెడి ప్రసంగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని ప్రధానో పాధ్యాయులు మంచి నాయకులను తమ పాఠశాలల్లోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు, విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్ది వారిని మంచి పౌరులుగా దేశ అభివృద్ధి కి వారి భవితకు పునాదులు వేయాలని కోరారు మంచి మానవత్వ విలువలను ,సహనాన్ని సోదర భావాన్ని పెంపొందించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది.ఈ శిక్షణా కార్యక్రమంలో కల్లూరు మండల విద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ శిక్షణతో మండల విద్యాధికారులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేకూరుతుందని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు, సమగ్ర శిక్ష అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్. రఫీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పునాదులు పడాలని ఆ మహత్తర కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులపై ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో కర్నూలు, కడప, నంద్యాల మండల విద్యాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , రాష్ట్రంలో శిక్షణ తీసుకున్న మాస్టర్ ఫెసిలిటేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.