నాయకత్వ లక్షణాలపై ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు కడప నంద్యాల జిల్లాల నుండి మండల విద్యాధికారులు , ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కర్నూలు నంద్యాల జిల్లాల విద్యాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు ఆరు రోజుల నాయకత్వ లక్షణాలపై శిక్షణా కార్యక్రమం cycle 2 గౌరవ డాక్టర్ అమ్మి నాయుడు రాష్ట్ర పరిశీలకులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల నుండి ప్రధానోపాధ్యాయులు వీరికి 13 మంది ప్రకాశం, సత్యసాయి nandyala జిల్లాల నుండి మాస్టర్ ఫెసిలిటేటర్స్ నాయకత్వ లక్షణాలపై శిక్షణ మొదటి రోజు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర పరిశీలకులు చెప్పడం జరిగింది, ఈ శిక్షణా కార్యక్రమానికి కర్నూలు నంద్యాల జిల్లాల విద్యా పర్యవేక్షణ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది శిక్షణ ఆహ్లాద కరమైన వాతావరణంలో రోజంతా జరిగి సాయంత్రం 6:30 గంకు ముగించడం జరిగింది, సాయంత్రం రెండు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ కళాకారులతో సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.