పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి గారు ఈ రోజు అనగా 20-06-2024 “ఘన వ్యర్థాల నిర్వహణ”పై దృష్టి సారించి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించాలని న్యాయ సేవ సదన్ నందు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీలు, సంభందిత శాఖలతో నిర్వహించి “ఘన వ్యర్థాలు” అంటే మరియు ఘన లేదా పాక్షిక-ఘన గృహ వ్యర్థాలు, సానిటరీ వ్యర్థాలు, వాణిజ్య వ్యర్థాలు, సంస్థాగత వ్యర్థాలు, క్యాటరింగ్, మార్కెట్ వ్యర్థాలు మరియు ఇతర రహితమైనవి నివాస వ్యర్థాలు, వీధి ఊడ్చడం, ఉపరితల కాలువల నుండి తొలగించబడిన లేదా సేకరించిన ఉద్యానవన వ్యర్థాలు, వ్యవసాయం మరియు పాడి వ్యర్థాలు, శుద్ధి చేయబడిన బయో-మెడికల్ వ్యర్థాలు మినహాయించి పారిశ్రామిక వ్యర్థాలు, బయో-మెడికల్ వ్యర్థాలు మరియు ఇ-వ్యర్థాలు, బ్యాటరీ వ్యర్థాలు, రేడియో-యాక్టివ్ వ్యర్థాలు. ఈ వ్యర్థాలు దృష్టిలో ఉంచుకొని వాటిని తొలగించుట కొరకు సంబంధిత అధికారులకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్టూడెంట్స్ కి మరియు గ్రామం, మండల స్థాయి లో ఈ కార్యక్రమంలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ నాగరాజ నాయుడు, డియలపిఓ. ఎస్.నూర్జహాన్, డిఆర్‌పి. వి.జేమ్స్ కృపావరం, ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, సైంటిఫిక్ ఆఫీసర్, జే.గణేశ్ కుమార్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.