విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి
1 min readఏపియుడబ్యూజే డిమాండ్.. మంత్రాలయం లో భారీ ర్యాలీ ధర్నా
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఇటీవల కుటుంబ కలహాలలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్ లో కవరేజ కోసం వెళ్లిన టివి 9 విలేకరి రంజిత్ పై లోగో తో దాడి చేయడం సిగ్గుచేటని ఏపియుడబ్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలుకా అధ్యక్షులు వగరూరు జయరాజ్, ప్రదాన కార్యదర్శి కె హుశేని, కోశాధికారి షాబువలి లు ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో రాఘవేంద్ర సర్కిల్ లో ఏపియుడబ్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా, చేపట్టారు. ర్యాలీ గా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జికే గురురాజరావు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరుల పై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తులు ఎదుగుదలకు దోహదపడిన మీడియా పైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబు వెంటనే అరెస్టు చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాదిత విలేకరుల ను ఆదుకొని బహిరంగ గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపియుడబ్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్యూజే మండల గౌరవాధ్యక్షులు రానోజీ రావు, అధ్యక్షులు భీమరాయ, కార్యదర్శి వెంకట్, కోశాధికారి రఫీ, రామస్వామి, వెంకటేష్, కంతం నరసింహులు, నాగరాజు, వీరేష్, చిదనంద, మున్న తదితరులు పాల్గొన్నారు.