11న తుమ్మలపల్లి లో పద్మశాలీల ఆత్మీయ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: వచ్చే నెల 11న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ రాష్ట్ర పద్మశాలీల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ రాష్ట్ర పద్మశాలియ సంఘం ఆహ్వాన కమిటీ వెల్లడించింది.అఖిల భారత పద్మశాలి సంఘం కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ పద్మశాలి సంఘాలన్నీ ఒక త్రాటిపైకి వచ్చిన నేపథ్యంలో వచ్చే నెల 11వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.చలో విజయవాడ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమానికి పద్మశాలీయ కుల బాంధవులు ఉద్యోగ వ్యాపార సంఘాలు, గ్రామ మండల నియోజకవర్గ జిల్లా ప్రాంత పద్మశాలీల సంఘాలు,మహిళా ,యువజన అన్ని అనుబంధ సంఘాలు, పద్మశాలి కళ్యాణ మండప నిర్వాహకులు ,శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవాలయాల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలన చేనేత పరిశ్రమ నిలదీక్కు కోవడం కష్టంగా ఉందన్నారు.చేనేత కార్మికుల జీవితాలు చాలా దుర్భరంగా మారాయని కుటుంబ పోషణ చేసుకోలేక ఆకలి చావులకు గురవుతున్నారని అన్నారు.వృత్తికి దూరమై ఇతర వృత్తుల్లోకి చేనేత వృత్తి కార్మికులు వలస వెళ్లిపోతున్నారని ఈ సందర్భంగా పద్మశాలీయ సంఘాల నేతలు పేర్కొన్నారు. పద్మశాలీయులను చైతన్యవంతుల్ని చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో రాణించేలా తీర్చిదిద్దటమే ఈ సమావేశం ముఖ్య లక్షణం అన్నారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెద్దలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.