గ్రామాభివృద్ధికి నిర్మాణాత్మక ప్రణాళిక రూపొందించాలి
1 min readఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ జె.డి రమణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గ్రామపంచాయతీల సుస్థిర అభివృద్ధికి నిర్మాణాత్మకంగా ప్రణాళిక రూపొందించాలని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ జె.డి రమణ సూచించారు. గురువారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో 10 గ్రామాల సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రస్తుతం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు వాటిని అందించడానికి పంచాయతీలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ శిక్షణ తరగతులు ఆరు రోజులపాటు ఉంటాయని, మండలంలోని 30 పంచాయతీలను మూడు విభాగాలుగా చేసి, ఒక్కో విభాగానికి రెండు రోజులపాటు శిక్షణ ఇస్తామని అలా 30 పంచాయితీల సర్పంచులు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీవో పి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి శ్రీనివాస్, బి. సింగవరం పంచాయతీ సెక్రటరీ ధోనే. విజయ భాస్కర్, ఏ పి ఎం యేసు రత్నం, అంగన్వాడి సూపర్వైజర్ పార్వతి, తదితరులు పాల్గొన్నారు.