తల్లి జ్ఞాపకార్థం ఉపాధ్యాయుడి సేవా కార్యక్రమం
1 min readమెట్టుపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్రతి సంవత్సరం తన తల్లి ధర్మన్నగారి సుభాషిణి జ్ఞాపకార్థం దాదాపు 10 వేల నుండి 15 వేల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని మరియు క్రీడా సామాగ్రిని అందిస్తూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూత నిస్తూ తన దాతృత్వం చాటుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి ఆదర్శనీయుడు మరియు అభినందనీయుడు అని మెట్టుపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర గుప్త కొనియాడారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభంలోనే మెట్టుపల్లి లోని 120 మంది విద్యార్థులకు అవసరమైన పలకలు నోట్ పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్లు, క్రేయాన్స్, అట్టలు, కాపీ రైటింగ్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ ను దాత చిన్నపరెడ్డి పంపిణీ చేయడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి ప్యాపిలి మండలంలో పీ.ఆర్. పల్లి, మాదినేనిదొడ్డి, సిద్దనగట్టు, హుసేనపురం, ప్యాపిలి బీ.సీ.కాలనీ మరియు కొచ్చెర్వు (డోన్) పాఠశాలల విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి హెడ్ మాస్టర్ రవీంద్ర గుప్త,ఉపాధ్యాయులు చిన్నపరెడ్డి,రమాదేవి,శివ తదితరులు పాల్గొన్నారు.