రహదారి గండి..ప్రమాదాలకు చిహ్నంగా చెట్టు మొక్క
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): గత రెండు నెలల నుండి తారు రోడ్డు గండి పడిందని ఈ గండి వల్ల వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని గండిని పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని వాహనదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహె బ్ పేట-కడుమూరు గ్రామాల మధ్యలో నున్న గనేట్ చిన్న బ్రిడ్జి దగ్గర గండి పడింది.గండి పడడంతో వాహనదారులు కింద పడి గాయాల పాలు అవుతున్నారని ప్రయాణికులు అంటున్నారు.వాహనదారులు గండిని గుర్తు పట్టాలనే ఉద్దేశంతో గండి దగ్గర చెట్టు మొక్కను ప్రయాణికులే పెట్టారు.అధికారులు అలసత్వం వీడి రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని అంతేకాకుండా ఈ రహదారిలో కర్నూలు జిల్లా నుండి వివిధ శాఖల అధికారులు మరియు వివిధ పనుల నిమిత్తం కర్నూలుకు అనునిత్యం ప్రయాణికులు వెళ్తూ ఉండడం అంతే కాకుండా మిడుతూరు మండల కార్యాలయాలకు పాఠశాలలు కళాశాలలకు విద్యార్థులు వెళ్తూ ఉండడంతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గండికి మరమ్మతులు చేసి ప్రమాదాలను అరికట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.