PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నడిచే మరుగుదొడ్డి.. కొత్తరకం మొబైల్ టాయిలెట్  

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మానవుని కాలకృత్యాలలో ముఖ్యమైన భాగం టాయిలెట్ రీసైకిల్ విధానంలో కొత్తరకం ఆవిష్కరణలో మరుగుదొడ్డి వ్యవస్థ ఎన్నో రూపాలు సంతరించుకుంది గతంలో బహిరంగ ప్రదేశాలలో అనంతరం బహిరంగ మరుగుదొడ్లలో తమ కాలకృత్యాలు తీర్చుకునేవారు అయితే రోగాలు ప్రబలుతుండడంతో బహిరంగ మలమూత్రాలు చేయకుండా ప్రభుత్వం ప్రతి ఇంట్లో మరగుదొడ్లు  కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టడంతో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి దీంతో అంటు రోగాలు ప్రబలడం దాదాపుగా 90 శాతం తగ్గిపోయింది అయితే వేరే ప్రాంతం నుంచి వివిధ పనులపై వచ్చే కూలీలు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళవలసిన అవసరం లేకుండా పనులు చేయించుకునే కాంట్రాక్టర్లు కొత్తరకం మొబైల్ టాయిలెట్ ను సమకూర్చడంతో  కూలీల సమస్య తీరింది ఇదే కోవలో గడివేముల మండలంలోని విద్యుత్ టవర్లు పనిచేసే వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ దర్శనం ఇచ్చింది ప్రత్యేకంగా ఇందులో పై ప్రదేశంలో నీటి సౌకర్యం ఉన్న చిన్నపాటి నీటి ట్యాంకును ఏర్పాటు చేశారు దీంతో కూలీల సమస్య తీరిందని కాంట్రాక్టర్ తెలిపారు మొబైల్ టాయిలెట్ నిండాక ఊరి శివారులో వీటిని బయో వేస్ట్ కింద నిర్విరం చేస్తామని తెలిపారు.

About Author