PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి –సిఐటియు     

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు లారీ హమాలి కార్మికుల విస్తృత సమావేశం  యూనియన్ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన  మార్కెట్ యార్డ్ లోజరిగింది ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్. రాధాకృష్ణ . కర్నూలు  న్యూ సిటీ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు  ఆర్. నరసింహులు. సిహెచ్ .సాయి బాబా. మార్కెట్ యార్డ్ యూనియన్ల గౌరవ అధ్యక్షులు టి. రాముడు గార్లు హాజరయ్యారు  వారు మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కార్మిక , రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించిన కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం  కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని అన్నారు  రాష్ట్రంలో లక్షలాది మంది  తమ రెక్కల కష్టంతో పనిచేస్తున్న హమాలీ ముఠా కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి హమాలీ కార్మికులకు వెల్ఫేర్ అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దేశంలో ఉన్న కోట్లాదిమంది అసంఘటిత కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలని అన్నారు  గత రెండు సంవత్సరాలుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లారీ హమాలి యూనియన్ కార్మికుల సమస్యలపై ప్రజల సమస్యలపై జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేసిన, రైతుల ఉద్యమానికి మద్దతుగా చేసిన పోరాటాలను సమీక్షించుకోవడం జరిగింది రాబోయే కాలంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని హమాలీ కార్మికులకు పిఎఫ్ ఇఎస్ఐ సౌకర్యం కోసం, 10 లక్షల బీమా సౌకర్యం కోసం పోరాడాలని, తీర్మానించుకోవడం జరిగింది అనంతరం  వ్యవసాయ మార్కెట్ యార్డ్ లారి హమాలి యూనియన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది యూనియన్ గౌరవ అధ్యక్షులుగా టి .రాముడు. యూనియన్ అధ్యక్షులుగా ఎం. వెంకటేశ్వర్లు. కార్యదర్శిగా యు. బిసన్న. ఉపాధ్యక్షులుగా  కే. కేశవులు, సహాయ కార్యదర్శిగా కే .మధు. యూనియన్ ట్రెజరర్ గా బి కే. రామకృష్ణ. కమిటీ సభ్యులుగా బి. నాగన్న. కే. కృష్ణ. శ్రీనివాసులు, ముత్తయ్య, యోహాన్, కోదండ రాముడు, ఎల్లప్ప లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశానికి  కోతహమాలి యూనియన్ నాయకులు  నాగరాజు ,వెంకటస్వామి, వలి, హమాలి నాయకులు దస్తగిరి,  కిట్టు,లచ్చు మద్దిలేటి, శివ శేఖర్, 165 మంది హమాలీలు పాల్గొన్నారు.

About Author