అబాకస్ లెవెల్ వన్ జోనల్ స్థాయిలో సత్తా చాటిన వి. లక్ష్మి రెడ్డి పాఠశాల విద్యార్థి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: అబాకస్ లెవెల్ వన్ జోనల్ స్థాయిలో సత్తా చాటిన వి. లక్ష్మి రెడ్డి ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాల విద్యార్థులు ఆదివారం కర్నూల్ నగరంలో గుడ్ షెఫర్డ్ స్కూల్లో అబాకస్ లెవెల్ వన్ జోనల్ సాయి కాంపిటీషన్ నిర్వహించారు .ఈ కాంపిటీషన్లో ప్యాపిలి పట్టణంలోని వి.లక్ష్మీ రెడ్డి పాఠశాల విద్యార్థిలు జి. రంగస్వామి మూడవ స్థానంలో విజయం సాధించాడు. అబాకస్ లెవెల్ వన్ జోనల్ స్థాయిలో సత్తా చాటిన రంగస్వామి కి తన తల్లిదండ్రులు,తోటి విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.వి. లక్ష్మిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాలలో సత్త చాటాడని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ వి. సంజీవరెడ్డి సార్ , స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి. ఇనాయతుల్లా , ఉపాధ్యాయులు ఎస్. రహంతుల్లా, టీ. వెంకటలక్ష్మి, కె. జ్యోతి పాల్గొన్నారు.