జీఓ 117ను రద్దు చేయండి : ఆప్టా
1 min readవిద్యాభివృద్ధికి ఆ జీఓ అడ్డంకి..
- మంత్రి నారా లోకేష్ ను కోరిన ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు
అమరావతి, పల్లెవెలుగు: గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం లో ప్రాథమిక విద్య కుంటుపడిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గటమే కాకుండా చాలామంది బాల బాలికలు పాఠశాల విద్యకు దూరం అయ్యారని ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు, ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాశ్ రావు, సహాద్యక్షుడు ఎం.జి. మెహది సోమవారం ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబును మరియు పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్ ఐ ఎ ఎస్ ను రాష్ట్ర సచివాలయం లో కలిసి వారికి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రం లో ప్రాథమిక విద్యను అభివృద్ది పదం లో కి తేవాలని ఆ శాఖను తన తనయుడు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబుకి కేటాయించారని వారు తెలిపారు. పాఠశాల విద్యను మెరుగు పరిచేందుకు తమ సంఘం పక్షాన కొన్ని సలహాలు, సూచనలు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు మరియు ముఖ్య కార్యదర్శి కి అందజేశారు.