పారదర్శకంగానే దరఖాస్తుల స్వీకరణ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: పారదర్శకంగానే మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మహానంది పోలీస్ స్టేషన్లో నంద్యాల ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాలు నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించిందని ప్రస్తుతం గడువు పూర్తి అయినా కూడా మరో రెండు రోజులపాటు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. పారదర్శకంగానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు కానీ ఇతర రికమండేషన్లు లేదా ప్రజాప్రతినిధులకు సంబంధించి లెటర్ హెడ్ లు తీసుకొని వచ్చారా…? అని దరఖాస్తుదారులను తాము అడగడం లేదని నిష్పక్షపాతంగా వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించి నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మహానంది మండలంలోని మూడు మద్యం దుకాణాలకు 28 దరఖాస్తులు వచ్చాయన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ స్టేషన్ నందు 7 కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆళ్లగడ్డ, బనగానపల్లె, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు, డోన్ శ్రీశైలం తదితర నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.