PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం

1 min read

-ఆర్థిక సహాయం అందించిన తోటి ఉద్యోగులు..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న సయ్యద్ అంజద్ భాష మిడుతూరు గృహ నిర్మాణ శాఖలో విధులు ముగించుకొని శుక్రవారం సా 5:30 సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.తోటి ఉద్యోగులు తెలిపిన సమాచారం మేరకు మిడుతూరు నుండి కర్నూలుకు బైకుపై వెళ్తుండగా ఉప్పలదడియ-దిగువపాడు మధ్యలో ఉన్న నయారా పెట్రోల్ బంకు దగ్గర గార్గేయపురం నుండి ఎదురుగా వస్తున్న(ఏపీ 39 UQ 0210)ఆటో బైక్ ను ఢీ కొట్టడం తీవ్ర గాయాలు కావడంతో ఎడమ కాలు విరిగింది చేతికి తలకు బలంగా గాయాలు అయ్యాయి.అంజద్ భాష అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.తోటి ఉద్యోగస్తులు ఇంటికి వెళ్తుండగా అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న సహచర ఉద్యోగులు గాయపడిన అంజాద్ భాష కు ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మంచి మనసుతో ముందుకు వచ్చి ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు 26 వేల నగదును అందజేశారు. మిడుతూరు ఏఈ భాస్కర్, వెలుగోడు ఏఈ మంద శ్రీను, వర్క్ ఇన్స్పెక్టర్లు సుబనాయాక్ భాష,సీవోలు అబ్దుల్ కలాం రామ్మోహన్ ఆసుపత్రికి వెళ్లి నగదును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

About Author