PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యాచారం  కేసులో నిందితుడికి 10 సం.లు కారాగార శిక్ష.. జరిమానా

1 min read

ఏలూరు మహిళా కోర్టు ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి స౦చలన తీర్పు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణ పోలీసు స్టేషనులో 2021లో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడైన  రుస్తుంబాద గ్రామానికి చెందిన మిసారపు అశోక్ తండ్రి భాస్కరరావు అనే అతనికి ఏలూరు మహిళా కోర్టు 5వ అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి 10 సం.లు కారాగార శిక్ష, రూ.5000/-లు జరిమానా విధిస్తూ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం తీర్పు వెల్లడించారని ఆ జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.రామాంజనేయులు తెలిపారు. ఈకేసు వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపురం పట్టణం రుస్తుంబాద ప్రాంతానికి చెందిన నిందితుడు మిసారపు అశోక్ తండ్రి భాస్కరరావు అనే వ్యక్తి నర్సాపురం అరుంధతి పేటకు చెందిన ఒక ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమె ఇసష్టానికి వ్యతిరేకంగా శారీరకంగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసినాడు. తరువాత ఆమెను పెండ్లి చేసుకోవడానికి నిరాకరించి మోసం చేసినాడు. ఆమె తల్లిదండ్రులు ద్వారా పెద్దల్లో పెట్టి అడిగించినా ఒప్పుకోలేదు. దానిపై ఆ యువతి  ఇచ్చిన ఫిర్యాదుతో నర్సాపురం పట్టణ పోలీసు స్టేషనులో ది.01-02-2021న అప్పటి ఎస్ఐ ఆర్.మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేయగా, అప్పటి నర్సాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్లి బి.కృష్ణ కుమార్,జి.శ్రీనివాస యాదవ్ లు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, సాక్షులను విచారించి పూర్తి దర్యాప్తు రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టడానికి నర్సాపురం పట్టణ పోలీసులు సహాకరి౦చారు.  కోర్టులో బాధితురాలు ఆమె తరపున సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి. రామాంజనేయులు ప్రవేశ పెట్టి వాదనలను త్వరతగతిన పూర్తి చేసి నిందితుడికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టారు. నిందితుడు మిసారపు అశోక్ ఆమెపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో ఏలూరు మహిళా కోర్టు 5వ అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి 10సం.లు కారాగార శిక్ష, మరియు రూ.5000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. యువతిని నమ్మించి మోసం చేసిన సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాలు జైలు మరియు వెయ్యి రూపాయలు జరిమానా విధించారని ఆకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామాంజనేయులు తెలిపారు.

About Author