ఉత్తమ ఫలితాల సాధనకు బలమైన పునాదులు అవసరం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు భాష మరియు గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను ,టెక్నాలజీలను ఉపయోగించాలని, విద్యార్థులకు స్నేహపూర్వక వాతావరణం లో అభ్యసనం జరిగేలా చూడాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శామ్యూల్ పాల్ ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులతో చర్చించడం జరిగినది .ఎఫ్ ఎల్ ఎన్ జిల్లాస్థాయి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి. తాండ్రపాడు లో కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ శ్రీ రమేష్ , ఏ ఎం ఓ. డాక్టర్ షేక్ రఫీ , కేఆర్పీలు, డిఆర్పీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.