ప్రభుత్వ గుర్తింపు లేని శ్రీ సర్వజ్ఞ కిడ్స్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
1 min read– ఆర్ యు ఎస్ ఎఫ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు నియోజకవర్గం లో ఆర్ యు ఎస్ ఎఫ్ రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రఘు మాట్లాడుతూ సర్వజ్ఞ కిడ్స్ స్కూల్ కి ఎటువంటి గుర్తింపు లేకపోయినా రంగు రంగు కరపత్రాలతో పోస్టర్ లతో యెమ్మిగనూరు లో వెలుగు లోకి వస్తున్నాయి.విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను ఆకర్షించడానికి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు వేసి ప్రచారం చేయడం తగదన్నారు . దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్ ని సిజ్ చేసి, ప్రభుత్వ నిబంధనలను తుంగల్లో తొక్కి నాందుకు గాను ఆ స్కూల్ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తా మని వారు హెచ్చరించారు.