మురవాణి ఎంపియుపి ఆదర్శ పాఠశాల హెచ్ఎం పై చర్యలు తీసుకోవాలి
1 min readఆర్ పి ఎస్ ఎఫ్, ఆర్ యూ ఎస్ ఎఫ్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పెద్దకడూరు మండలం మురవాణి గ్రామం ఎంపియుపి ఆదర్శ పాఠశాలలో విధులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్ఎం పై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డి ఈ ఓ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథ్ ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ ఎచ్. మురవాణి గ్రామంలో ఎంపీయూపీ ఆదర్శ పాఠశాలలో హెచ్ఎమ్ గా విధులు నిర్వహిస్తున్నరు,ఎమ్ ఆర్ సి కార్యాలయనికి వెళ్తునట్టు చెప్పి తన వ్యక్తిగత పనులు పై తిరుగుతున్నారు అని గ్రామస్తులు తెలపగా దీని పై మేము పాఠశాలని సందర్శించిగా అప్పుడు హెచ్ ఎమ్ లేకపోవడం, అక్కడ మిగతా టీచర్స్ ని అడగగా ఉదయం పదకొండు గంటలకు ఎమ్ ఆర్ సి కీ వెళ్లారు అని చెప్పారు మేము వెళ్ళినప్పుడు సమయం సుమారు రెండు గంటలకు పైగా అయినా కూడా అయినా ఇంతవరకు రాలేదు అని హెచ్ ఎమ్ కి ఫోన్లో సంప్రదించగా వారు స్పందించ లేదు అని కొద్దిసేపు తరువాత పాఠశాలకీ హెచ్ ఎమ్ రాగా విద్యార్ధి సంఘాల గా మేము ప్రశ్నించగా గేట్ దెగ్గర నే మా పై దుర్భాషలాడుతూ మీరు విద్యార్థి సంఘాల అయితే నాకు ఏంటి నాకు అధికారులు, నాయకులు మద్దతు ఉంది మాపై అగ్రహం వ్యక్తం చేశారు . అక్కడ గ్రామస్తులు కూడా హెచ్ ఎమ్ తీరుని చూసి ఆశ్చర్యపోయారు . అలాగే ఆ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కూడా సరిగా లేదని గ్రామస్తులు తెలపారు. ఇప్పటికి అయినా హెచ్ ఎమ్ పై చర్యలు తీసుకోవాలి ని డిమాండ్ చేశారు. ఈ విషయం పై డిప్యూటీ డి ఈ ఓ స్పందించి విచారణ జరిపిస్తాం అని హామీ ఇచ్చారు.