సరైన అనుమతులు లేని నేషనల్ ఒకేషనల్ కళాశాల పై చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో ఉన్న నేషనల్ ఒకేషనల్ కళాశాలకు సరైన అనుమతులు లేవుని అలాంటి కళాశాల పై చర్యలు తీసుకోవాలి రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడత్తు ఎమ్మిగనూరు లో ఉన్న ఒకేషనల్ కళాశాలకి షిఫ్టింగ్ అనుమతి మరియు ఫైర్ అనుమతులు లేవు అని, కళాశాల లో దాదాపు 80 మంది పైగా విద్యార్థులు చదువుతున్నారు అని వారి దెగ్గర నుంచి ఇష్టానసారంగా ఫీజ్లు వసూలు చేసుకుంటు సరైన విద్యాని మరియు వసుతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అని, ఈ కళాశాల లో సరైన లెక్చరర్స్ మరియు పరికరాలు లేక విద్యార్థుల తీవ్రంగా నష్టపోతున్నారు ని కానీ కళాశాల యాజమాన్యం మాత్రం ఫీజులు వసూలు చేసుకోవడంలో ముందు ఉంటున్నారు అని అన్నారు. నేషనల్ ఒకేషనల్ కళాశాల పై ఆర్ఐఓ కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులుకు న్యాయం చేయాలి వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ కి ఫిర్యాదు చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నరసింహ,అప్సర్, చిన్న, శ్రీని, ఆదిత్య, బాబు తదితరులు పాల్గొన్నారు.