PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ రుద్రభారతి పేట అక్రమార్కులపై చర్యలేవి!

1 min read

అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో

పెట్రేగిపోతున్న భూ అక్రమార్కులు

ఇప్పటికైనా స్పందించి అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలి

టిడిపి నాయకులు పొట్టి పాటి రానా ప్రతాప్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రుద్రభారతి పేటలో అక్రమాలు జరిగాయని అక్రమార్పులపై చర్యలు తీసుకుని వారి నుండి రెవెన్యూ రికవరీ చట్టం( ఆర్ఆర్ యాక్ట్) కింద ప్రభుత్వాన్ని మోసం చేసిన  సొమ్మును  రికవరీ చేసి వారిపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలని స్వయాల జిల్లా కలెక్టర్ ఆదేశించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కింది స్థాయి అధికారులు వాటిని తుంగలో తొక్కి తమకు అలాంటి వేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్టి పాటి రాణా ప్రతాప రెడ్డి అన్నారు, ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రుద్రభారతి పేటలో కొంతమంది అక్రమాలకు పాల్పడినట్లు అధికారులే నిర్ధారించి అక్రమార్కులను గుర్తించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారు లైన జిల్లా కలెక్టర్ స్పందించి రుద్రభారతి పేట అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద 16 లక్షల 71 వేల వంద రూపాయలు వసూలు చేయాలని, అదేవిధంగా వారిపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశించినప్పటికీ వారు వాటిని తుంగలో తొక్కడం వల్ల, రుద్రభారతిపేట భూ అక్రమ దారులు మరింత రెచ్చిపోయి నేటికీ అక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నేటికీ కొంతమంది మహిళల స్థలాలను ఆక్రమించి వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వారు వెళ్లి అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడం ఎంతవరకు సబబు అని ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎవరైనా ఇలాంటి భూ ఆక్రమణలకు పాల్పడితే వెంటనే వారిపై విరుచుకుపడే అధికారులు, రుద్రభారతి పేట  అలాగే చెన్నూరు కొత్త గాంధీనగర్ లో జరుగుతున్న భూ అక్రమ దారులపై ఎందుకు చర్యలు చేపట్టలేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికీ వారు రుద్రభారతి పెట్టలోకి వెళ్లి అక్కడ కొందరిని బెదిరించడం అక్కడి బాధితులు వెళ్లి అధికారులకు చెప్పుకున్న వారు పరిష్కరించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా రుద్రభారతి పేటలో ఉన్న కోనేరు స్థలాన్ని కూడా కబ్జా చేసి అమ్ము కోవడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే రెవిన్యూ అధికారుల పైన ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని ఇకమీదటనైనా అధికారులు సందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. స్వయంగా జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కలెక్టర్ కు రుద్రభారతి పేట గృహ నిర్మాణాలలో అవక తవకలు జరిగాయని, అక్రమార్కులు దొంగ డిపారాలతో గృహ నిర్మాణాలు చేపట్టారని, అదేవిధంగా అక్కడ అక్రమాలు జరిగాయని జిల్లా కలెక్టర్కు తెలపడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని వారి వద్ద నుండి 16 లక్షల 71 వేల వంద రూపాయలు రికవరీ చేసి అలాగే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులలో స్పందన లేదన్నారు. ఇప్పటికే అటు రెవిన్యూ అధికారులకు, ఇటు పోలీస్ అధికారులకు కూడా జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి వద్ద నుండి వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా గృహ నిర్మాణ శాఖ మండల అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా పంపించడం జరిగింది అన్నారు. అయినప్పటికీ అధికారులలో ఇంకా నిర్లక్ష్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోకపోతే తామే తాహాశిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించవలసి వస్తుందని ఆయన తెలిపారు.

About Author