రద్దీ సమయంలో భక్తులకు ఆటోవాలాలు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
1 min readఎస్సై పరమేష్ నాయక్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం లో రద్దీ సమయంలో భక్తులకు ఆటోవాలాలు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై పరమేష్ హెచ్చరించారు . ఆదివారం సిఐ రామాంజులు ఆదేశాల మేరకు ప్రధాన రహదారిలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య ను సిబ్బందితో కలిసి తొలగించారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థమై మంత్రాలయం చేరుకున్న భక్తులు తమ వాహనాలను రోడ్డు పై ఉంచడం వల్ల అటోలు ఇష్టారాజ్యంగా తిరగడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. అందువల్లనే భక్తులు, ఆటోవాలాల నుంచి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని సరైన రికార్డులు లేని ఆటోల చోదకులకు అపరాధ రుసుం వేయడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ సమస్య ను అధిగమించాలంటే బైపాస్ రోడ్డు త్వరగా పూర్తి చేయడమే ఏకైక మార్గమని తెలిపారు.