ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడిచేస్తే చర్యలు తప్పవు.. కలెక్టర్
1 min readప్రైవేటు కళాశాలలకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫీజులు చెల్లించలేదనే కారణంతో డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు హాజరుకాకుండా అడ్డు కోవడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువచ్చే చర్యలు చేపడితే సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు..ఫీజు రీఇంబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందని కలెక్టర్ తెలిపారు.. విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని, విద్యార్ధుల చదువుకు ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలు కూడా చేపట్టకూడదని కలెక్టర్ కళాశాలల యాజమాన్యాలకు స్పష్టంచేశారు.