తల్లితండ్రులను కోల్పోయి.. అనాథలైన పిల్లలకు పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటాం
1 min readఇద్దరూ చనిపోయి అనాథలైన పిల్లలకు పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ల సదస్సులో పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ అమరావతి/కర్నూలు: వెలగపూడి సచివాలయంలో రెండవ రోజు నిర్వహించిన కలెక్టర్ ల సదస్సులో తల్లితండ్రులు ఇద్దరూ చనిపోయిన అనాథలైన పిల్లలకు పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు తెలిపారు.పెన్షన్ ల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ అంశాన్ని లేవనెత్తారు..ఆస్పత్రుల్లో ప్రసవ సమయంలో తల్లి చనిపోయి అనాధగా మారిన పిల్లలకు, ప్రమాదాల్లో తల్లిదండ్రులు చనిపోయి అనాధ లైన పిల్లలకు, పాక్షికంగా అనాధ లైన పిల్లలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ మంజూరు చేస్తే బాధ నుండి వారికి కొంత ఉపశమనం కలుగుతుందని కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు..మిషన్ వాత్సల్య కింద వీరికి 3 ఏళ్లు దాకా మాత్రమే కొంత సాయం అందుతోందని కలెక్టర్ వివరించారు…కలెక్టర్ చేసిన వినతిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ మొదట తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయిన పిల్లలకు సాయం చేద్దామని, ఈ అంశంలో గైడ్ లైన్స్ తయారు చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.కలెక్టర్ల మొదటి కాన్ఫరెన్స్ లో భర్త చనిపోయిన వెంటనే అతని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని తాను ముఖ్యమంత్రి ని కోరిన వెంటనే ఉత్తర్వులు జారీ చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.